Heavy pilgrims at Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. ఆరు కిలోమీటర్ల మేర క్యూ... గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు.. క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశం నిలిపివేసిన టీటీడీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా.
Tirumala, October 8: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు (Devotees) క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో, టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది.
దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించిన ఆయన, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని, అందుకే రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 08, 2022 09:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

