TTD: తిరుమ‌ల వెళ్లేవారికి అల‌ర్ట్! స‌ర్వ‌ద‌ర్శనం టోకెన్లు ర‌ద్దు చేసిన టీటీడీ, ఈ నెల 22 నుంచి వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌న టోకెన్లు

డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా డిసెంబ‌రు 22న శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్లను ర‌ద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భ‌క్తులు తిరుమ‌ల‌(Tirumala) లో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా స‌ర్వద‌ర్శనంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చని సూచించారు.

TTD: తిరుమ‌ల వెళ్లేవారికి అల‌ర్ట్! స‌ర్వ‌ద‌ర్శనం టోకెన్లు ర‌ద్దు చేసిన టీటీడీ, ఈ నెల 22 నుంచి వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌న టోకెన్లు
Credits: Twitter/TTD

Tirupati, DEC 20: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం (Vaikunta Dwara drshanam) క‌ల్పించేందుకు టీటీడీ(TTD) ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈ సంద‌ర్భంగా డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా డిసెంబ‌రు 22న శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్లను ర‌ద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భ‌క్తులు తిరుమ‌ల‌(Tirumala) లో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా స‌ర్వద‌ర్శనంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చని సూచించారు. 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుప‌తిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార ద‌ర్శన టోకెన్ల జారీ ప్రారంభమవుతుందని వివరించారు. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుందని తెలిపారు.

TTD: తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచిన వార్తలన్నీ అబద్దం, సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి 

ప‌ర్వదినాల సందర్భంగా డిసెంబ‌రు 22 నుంచి 24వ తేదీ వ‌ర‌కు, డిసెంబ‌రు 31, జ‌న‌వ‌రి 1వ తేదీల్లో శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. స‌హ‌స్ర దీపాలంకార సేవ‌, ఆర్జిత సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. స్వయంగా వ‌చ్చే ప్రోటోకాల్ వీఐపీల‌కు, కుటుంబ సభ్యులకు ప‌రిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ ద‌ర్శనం ఇస్తామని, 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Dec 20, 2023 09:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).