Vijayawada Horror: విజయవాడలొ దారుణం, భార్యను కాపురానికి పంపలేదని నడిరోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు, తృటిలో తప్పించుకున్న మామ
విజయవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అల్లుడు.. అత్తను రోడ్డుపై వెంటాడి దారుణంగా నరికి చంపాడు. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
Vjy, June 26: విజయవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అల్లుడు.. అత్తను రోడ్డుపై వెంటాడి దారుణంగా నరికి చంపాడు. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నాగమణి, గురుస్వామిల కూతురుని కుంబా రాజేశ్ అనే యువకుడికి వచ్చి వివాహం చేశారు. కొన్ని రోజుల తరువాత అల్లుడు వేధింపులకు గురి చేస్తుండడంతో కూతురును కాపురానికి పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచుకున్నారు.
భార్యను కాపురానికి పంపకుండా వేధిస్తున్నారని, విడాకుల కోసం కోర్టులో కేసు వేశారనే కక్షతో అల్లుడు రాజేశ్ ఆదివారం విజయవాడలో అత్త నాగమణి, మామ గురుస్వామిపై వెంటపడి వెంకట్రావు వంతెన దొరకపట్టుకున్నాడు. నడిరోడ్డుపై ముందుగా అత్తపై దాడిచేసి నరికి చంపగా మామ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 04:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

