Vijayawada Kanaka Durga Temple (Image: Twitter)

Vijayawada Kanaka Durga: సెప్టెంబర్ 25 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులులలో అమ్మవారికి చేయు అలంకారాలు , కట్టే చీర రంగు , నైవేద్యం వివరాలు మీ కోసం..

>> 26-09-22 సోమవారం - పాఢ్యమి - స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - బంగారు రంగు చీర - కట్టెపొంగలి , చలిమిడి , వడపప్పు , పాయసం

>> 27-09-22 మంగళవారం - విదియ - శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి - లేత గులాబీ రంగు చీర - పులిహార

>> 28-09-22 బుధవారం - తదియ - శ్రీ గాయత్రీ దేవి - కాషాయ లేదా నారింజ రంగు చీర - కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం

> 29-09-22 గురువారం - చవితి - శ్రీ అన్నపూర్ణ దేవి - గంధపురంగు లేదా పసుపు రంగు చీర - దద్దోజనం , క్షీరాన్నం , అల్లం గారెలు

CM Seat: మహారాష్ట్రలో రాజకీయ దుమారం.. సీఎం ఏక్‌నాథ్ షిండే కుర్చీలో కూర్చున్న తనయుడు.. ‘సూపర్ సీఎం’ అని విమర్శిస్తున్న విపక్షాలు 

>> 30-09-22 శుక్రవారం - పంచమి - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - కుంకుమ ఎరుపు రంగు చీర - దద్దోజనం , క్షీరాన్నం

>> 01-10-22 శనివారం - షష్ఠి - శ్రీ మహాలక్ష్మీ దేవి - గులాబీ రంగు చీర - చక్కెర పొంగలి , క్షీరాన్నం

>> 02-10-22 ఆదివారం - సప్తమి - శ్రీ సరస్వతీ దేవి - తెలుపు రంగు చీర - దద్దోజనం, కేసరి, పరమాన్నం

>> 03-10-22 సోమవారం - అష్టమి - శ్రీ దుర్గా దేవి - ఎరుపు రంగు చీర - కదంబం, శాకాన్నం

>> 04-10-22 మంగళవారం - నవమి - శ్రీ మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు చీర - చక్కెర పొంగలి

>> 05-10-22 బుధవారం - దశమి - శ్రీ రాజరాజేశ్వరి దేవి - ఆకుపచ్చ రంగు చీర - లడ్డూలు , పులిహోర , బూరెలు , గారెలు , అన్నం