Vinukonda Murder Case: వినుకొండ వైసీపీ కార్యకర్త హత్యపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు కీలక ప్రకటన, వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని వెల్లడి

బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్‌ రషీద్‌ అనే యువకుడి దారుణ హత్య చేసిన సంగతి విదితమే. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు.

Vinukonda Murder Case: వినుకొండ వైసీపీ కార్యకర్త హత్యపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు కీలక ప్రకటన, వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని వెల్లడి
palnadu-district-sp-k-srinivas-rao (photo-Video Grab)

Vjy, July 18: బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్‌ రషీద్‌ అనే యువకుడి దారుణ హత్య చేసిన సంగతి విదితమే. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు.  హత్యకు గురైన రషీద్ కుటుంబానికి అండగా ఉండేందుకు రేపు వినుకొండకు వెళ్లనున్న వైఎస్ జగన్, ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదని మండిపాటు

ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు వల్ల మాత్రమే ఈ హత్య జరిగిందని, ఈ హత్య కు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.

(The above story first appeared on LatestLY on Jul 18, 2024 09:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).