West Godavari Shocker: పెళ్లన్నాడు, లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు, ఆ తర్వాత నాకు పెళ్లైందని బస్టాండ్‌లో వదిలేశాడు, పంగిడిగూడెం గ్రామంలో దారుణ ఘటన, కేసు నమోదు చేసిన ద్వారకా తిరుమల ఎస్సై
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలికను అంజి బాబు అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి (Young Girl raped in lodge) పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు నిందితుడు అంజిబాబుపై ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
West Godavari, August 21: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలికను అంజి బాబు అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి (Young Girl raped in lodge) పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు నిందితుడు అంజిబాబుపై ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.కాగా పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకా తిరుమల ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిగూడెంకు చెందిన 15 ఏళ్ల బాలికకు, నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పెయింటర్ బుద్దాల అంజిబాబుతో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్టు నమ్మించి, పెళ్లి చేసుకుంటానని ఈనెల 19న బాలికను ద్వారకా తిరుమలకు రప్పించాడు. అనంతరం ఒక లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత బస్టాండ్‌కు తీసుకెళ్లి విడిచిపెట్టాడు.
తనకు పెళ్లైందని, ఇంటికి వెళ్లిపోమని చెప్పి అంజిబాబు అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో బాలిక ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి, స్థానిక పోలీస్టేషన్‌లో అదే రోజు రాత్రి ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
(The above story first appeared on LatestLY on Aug 21, 2021 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

