YSRCP Manifesto Live Video : తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న సీఎం..ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు

వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. శనివారం తాడేపల్లిలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు

YSRCP Manifesto Live Video : తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న సీఎం..ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు
YS jagan memantha-siddham-(photo-X/YSRCP)

వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో  విడుదల  చేశారు. శనివారం తాడేపల్లిలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు.  గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేసింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం. దీంతో అటు ప్రజల్లో, ఇటు రాజకీయ శ్రేణుల్లో ఈ ఎన్నికల మేనిఫెస్టోపై ఆసక్తి నెలకొంది.  అయితే అలవికాని హామీలు, ఆచరణ సాధ్యం కానివి మేనిఫెస్టోలో ఉండవని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

ఇక సిద్ధం బహిరంగ సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన సీఎం వైయ‌స్ జగన్‌.. రేపటి నుంచి మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ మూడో విడత ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనబోతున్నారు. అనంతపురం తాడిపత్రిలో రేపు తొలి ఎన్నికల ప్రచారతాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న సీఎం సభ జరగనుంది. మే 11వ తేదీ దాకా రోజూ మూడు సభలు నిర్వహించేలా వైయ‌స్ఆర్‌సీపీ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది.

(The above story first appeared on LatestLY on Apr 27, 2024 12:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).