COVID Status in TS: కోవిడ్ టీకా తీసుకున్న కొన్ని రోజులకే కరోనా పాజిటివ్, తెలంగాణలో మందకోడిగా సాగుతున్న రెండో విడత వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా మరో కోవిడ్ కేసులు నమోదు
మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో 20 రోజుల కిందట మొదటి డోసు టీకా తీసుకున్న 8 మంది వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఇద్దరు వైద్యులు, మిగతా ఆరుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. వీరిని ఐసోలేషన్లో ఉంచి చికిత్సనందిస్తున్నట్లు అధికారులు తెలిపారు....
Hyderabad, February 10: తెలంగాణలో కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా కొంతమంది వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో 20 రోజుల కిందట మొదటి డోసు టీకా తీసుకున్న 8 మంది వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఇద్దరు వైద్యులు, మిగతా ఆరుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. వీరిని ఐసోలేషన్లో ఉంచి చికిత్సనందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండో విడత వ్యాక్సినేషన్ ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం కొనసాగుతోంది. అయితే చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. మంగళవారం నాటికి కేవలం 38 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. టీకా ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఫిబ్రవరి 9వరకు అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలో 2,28,845 మంది కోవిడ్ టీకాలు చేయించుకున్నారు.
మరోవైపు, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 29,666 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 157 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 727 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,95,988కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 27 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 11 మరియు రంగారెడ్డి నుంచి 10 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

అలాగే గత 24 గంటల్లో మరొక కోవిడ్ మరణం సంభవించడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,613కు పెరిగింది. అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 163 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,92,578 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1797 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Feb 10, 2021 10:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

