Adilabad RIMS Tragedy: ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల పసికందు మృతి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU) వార్డులో సోమవారం అర్ధరాత్రి దారుణమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారుల వార్డులో ఉన్న ఎయిర్ కండిషనర్ (AC) షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Adilabad RIMS Tragedy: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU) వార్డులో సోమవారం అర్ధరాత్రి దారుణమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారుల వార్డులో ఉన్న ఎయిర్ కండిషనర్ (AC) షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అసెంబ్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన అధికారి.. వెంటనే CPR చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.. మార్గం మధ్యలో కన్నుమూత.. వీడియో ఇదిగో..
సోమవారం అర్ధరాత్రి సమయంలో SNCU వార్డులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ సంభవించి అది పేలిపోయింది. దీంతో వార్డు అంతటా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో వార్డులో చికిత్స పొందుతున్న 5 రోజుల పసికందు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. దట్టమైన పొగలు, అగ్నికీలలు అలముకోవడంతో వార్డులో ఉన్న పసిపాపల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురై తమ పిల్లలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు.
Five-Day-Old Baby Dies After Fire Breaks Out at RIMS Adilabad
బ్రేకింగ్ న్యూస్
ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం
చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి
ఆందోళనకరంగా మరో 24 మంది చిన్నారుల పరిస్థితి
అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి… pic.twitter.com/WfSAgHZ4tG
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026
ప్రమాదాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టారు. వార్డులో ఉన్న మిగతా చిన్నారులను సిబ్బంది త్వరితగతిన పక్క వార్డులకు తరలించారు. ఆందోళనకరంగా ఉన్న 24 మంది చిన్నారులను మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు అత్యవసరంగా తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం.
విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
ఈ ప్రమాదంలో పసికందులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొగ పీల్చి అస్వస్థతకు గురై ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులందరికీ అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించాలని జిల్లా అధికారులను మరియు వైద్య ఆరోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర ఉన్నతస్థాయి విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీనియర్ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై తక్షణ విచారణకు ఉత్తర్వులు ఇచ్చారు.
(The above story first appeared on LatestLY on Sep 22, 2026 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

