Telangana: నేటి నుంచి తెలంగాణలో జూనియర్ కళాశాలల సిబ్బంది విధులకు హాజరు కావాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు, రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం
వచ్చే నెల 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభ కానున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణపై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్‌బిఐఇ) మార్గదర్శకాలు జారీ చేసింది. మొదటి, రెండు సంత్సరాల తరగతులు రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు....
Hyderabad, June 25: తెలంగాణలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు చెందిన లెక్చరర్లు ఈరోజు నుంచి విధులకు హాజరుకావాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభ కానున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణపై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్‌బిఐఇ) మార్గదర్శకాలు జారీ చేసింది. మొదటి, రెండు సంత్సరాల తరగతులు రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు.
ఇంటర్ బోర్డు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, తెలంగాణలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు జూలై 1 నుండి ప్రత్యామ్నాయ రోజుల్లో భౌతిక తరగతులు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలను జూలై 1న తిరిగి తెరవాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఇదివరకే ఆదేశాలు జారీ అయ్యాయి.
భౌతిక తరగతులకు కచ్చితంగా హాజరు కావాలనే నిబంధన ఏమి లేదు. అయితే హాజరు కావడానికి ఇష్టపడే విద్యార్థులు తల్లిదండ్రుల నుండి సమ్మతి లేఖను సమర్పించాలి.
ఈ విద్యా సంవత్సరంలో సుమారు 220 పని దినాలను నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ యోచిస్తుంది. భౌతిక తరగతులు మాత్రమే కాకుండా, టీవీ ద్వారా మరియు టి-సాట్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు ప్రత్యామ్నాయ రోజులలో ప్రసారం చేయబడతాయి.
జూనియర్ లెక్చరర్లు భౌతిక తరగతులకు హాజరుకాకపోయిన విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ప్రాతిపదికన గూగుల్ మీట్, జూమ్ మరియు మరిన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తరగతులు తీసుకోవచ్చు.
అయితే ఎన్నిరోజులు తరగతులు నిర్వహించబడాయి అనే దానిపై ఇప్పటికీ ఒక అనిశ్చితి నెలకొన్న కారణంగా ప్రస్తుతానికి 70 శాతం సిలబస్‌ను ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొనసాగిస్తామని మార్గదర్శకాలు తెలిపాయి.
ఇక, విద్యార్థులకు పర్సిహుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కోసం కళాశాలలు మరియు పరిసర ప్రాంగణాలు అన్ని చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించి జూన్ 25 నుండి విధులకు హాజరయ్యే సిబ్బంది ఎప్పటికప్పుడు నివేదించాలని బోర్డ్ స్పష్టం చేసింది.
(The above story first appeared on LatestLY on Jun 25, 2021 11:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

