Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో కొత్త రికార్డు.. రూ. 39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి!
ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఏడాది వేలంలో సాహెబ్‌నగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్భన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలు వెచ్చించి స్వామివారి లడ్డూను కైవసం చేసుకున్నారు.
Balapur Ganesh Laddu Auction: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తించే చారిత్రక బాలాపూర్ గణేశుడి ప్రసాదం (21 కిలోల లడ్డూ) వేలం పాట మరోసారి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఏడాది వేలంలో సాహెబ్‌నగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్భన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలు వెచ్చించి స్వామివారి లడ్డూను కైవసం చేసుకున్నారు.
గతేడాది (2025) కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకోగా.. ఈసారి ఆ రికార్డును అధిగమించి ఏకంగా రూ. 4 లక్షలు అదనంగా ధర పలకడం విశేషం. బాలాపూర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఓపెన్ వేలంలో మొత్తం 9 మంది భక్తులు పోటీపడ్డారు. భక్తులు ఒకరిని మించి మరొకరు బిడ్ పెంచుతూ పోవడంతో వేలం ప్రాంగణం 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో హోరెత్తింది. తీవ్ర పోటీ నడుమ చివరికి సామ ప్రణీత్ రెడ్డి రూ. 39 లక్షల వద్ద లడ్డూను సొంతం చేసుకున్నారు.
Balapur Ganesh Laddu Auction
#WATCH | Rangareddy, Telangana: The famous Balapur Ganesh Laddu prasadam has been auctioned for a record price of ₹39 lakh.
Sama Praneet Reddy, a businessman from Urban Reality Group, emerged as the successful bidder, outbidding several others for the sacred 21-kg laddu on the final day of the Ganesh immersion festivities. The winning bid breaks the previous year's record of ₹35 lakh.
— ANI (@ANI) September 25, 2026
1994లో కేవలం రూ. 450 తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం ప్రస్థానం, గత 31 ఏళ్లలో రూ. 39 లక్షల స్థాయికి చేరింది. బాలాపూర్ గణనాథుడి లడ్డూను దక్కించుకుని పొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని, వ్యాపారాల్లో అష్టైశ్వర్యాలు, అభివృద్ధి కలుగుతాయనే బలమైన విశ్వాసం భక్తుల్లో ఉంది. వేలంలో వచ్చిన నిధులను బాలాపూర్ గ్రామాభివృద్ధి, పాఠశాలల వసతులు మరియు ఆలయ నిర్మాణ సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారు. వేలం ముగిసిన అనంతరం లడ్డూను దక్కించుకున్న ప్రణీత్ రెడ్డిని ఉత్సవ సమితి సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ వేలం ప్రక్రియ పూర్తికావడంతో నగరంలో శోభాయాత్ర అధికారికంగా రూపుదిద్దుకుని హుస్సేన్‌సాగర్ నిమజ్జనం వైపు కదిలింది.
(The above story first appeared on LatestLY on Sep 25, 2026 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

