Godavari Floods: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. నీట మునిగిన పర్ణశాల .. మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. 53 అడుగులు దాటిన నీటిమట్టం..

తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

Godavari Floods: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. నీట మునిగిన పర్ణశాల .. మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. 53 అడుగులు దాటిన నీటిమట్టం..
Godavari Floods

Godavari Floods: ఎగువ ప్రాంతాలు నుంచి వస్తున్న వరద, కాళేశ్వరం నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. గురువారం కేవలం 30 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం, శనివారం ఉదయానికి ఏకంగా 55.1 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రవాహ ఉద్ధృతి వేగంగా పెరుగుతుండటంతో అధికారులు భద్రాచలం వద్ద మూడో, చివరి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు దాటే సాహసం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.

భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం.. నగరమంతా ట్రాఫిక్ జామ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

మునిగిన పర్ణశాల – స్తంభించిన రాకపోకలు: సీతవాగు ఉద్ధృతికి పర్ణశాల వద్ద స్నానఘట్టాలతో పాటు సీతమ్మ నార చీరలు, దేవతామూర్తి పీఠం మరియు ఇనుప వంతెన నీటిలో మునిగిపోయాయి. దుమ్ముగూడెం - భద్రాచలం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తురుబాక ఆర్‌అండ్‌బీ వంతెన అప్రోచ్ రోడ్లు కోతకు గురికావడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. చార్ల మండలం వీరాపురం శివారులోని ఇసుక క్వారీలో అకస్మాత్తుగా వరద రావడంతో చిక్కుకుపోయిన 44 మంది లారీ డ్రైవర్లు, స్థానికులను అధికారులు సురక్షితంగా కాపాడారు. అయితే 30కి పైగా లారీలు నీటిలోనే చిక్కుకుపోయాయి. సహాయక చర్యల సమయంలో తెప్పపై నుంచి నీటిలో పడిన ఇద్దరు పోలీసు అధికారులు ఈదుకుంటూ క్షేమంగా బయటపడ్డారు.అశ్వాపురం మండలంలో అత్యవసర పరిస్థితిలో ఉన్న ఒక గర్భిణిని థర్మాకోల్ తెప్పపై సురక్షిత ప్రాంతానికి తరలించారు.

వరద ముంపు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి సీతక్క స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు. భద్రాచలం ఎగువన ఉన్న మంగపేట మండల కేంద్రానికి చేరుకున్న ఆమె.. కరకట్ట పనుల పురోగతిని, గోదావరి ఉద్ధృతిని సమీక్షించారు. పొద్మూరు, ముస్లిం వాడ, బీసీ కాలనీల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. భోజన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. గోదావరి ఉద్ధృతి తగ్గే వరకు అధికారులు ఎవరూ హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని ఖరాకండిగా ఆదేశించారు. ఇక

(The above story first appeared on LatestLY on Aug 01, 2026 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).