Harishrao Slams Congress: బుల్డోజర్,జేసీబీ వచ్చినా మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు..కొడంగల్‌లో సీఎం రేవంత్ ఇల్లు కుంటలోనే ఉందన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు

ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచం లాగా నిలబడతాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మూసీ పరివాహాక ప్రాంతాల బాధితుల ఇళ్లను పరామర్శించిన హరీశ్‌..అనంతరం మీడియాతో మాట్లాడారు.

Harishrao Slams Congress: బుల్డోజర్,జేసీబీ వచ్చినా మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు..కొడంగల్‌లో సీఎం రేవంత్ ఇల్లు కుంటలోనే ఉందన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు
BRS Harish Rao Comments On Congress Govt Over Hydra Demolition(X)

Hyd, Sep 29: ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచం లాగా నిలబడతాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మూసీ పరివాహాక ప్రాంతాల బాధితుల ఇళ్లను పరామర్శించిన హరీశ్‌..అనంతరం మీడియాతో మాట్లాడారు.

బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమల్ని ఎత్తాలి తప్ప.. మీ ఇళ్లను ఎత్తనిచే ప్రశ్నే లేదు అన్నారు. రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడు...కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందన్నారు.సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది.. అతని తమ్ముడి ఇల్లు FTL లో ఉంది.. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి అని డిమాండ్ చేశారు.

మీకో న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా?, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. రూ.4000 పెన్షన్ ఇవ్వమని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు..రైతులకు రైతు భరోసా 7500 వెయ్యమంటే దానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు అన్నారు. మహిళలకు 2,500 ఇవ్వమని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు..ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఎ అందజేయండి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడన్నారు.ఏది అడిగినా డబ్బులు లేవు అంటున్న రేవంత్ రెడ్డి.. మరి మూసీ సుందరీకరణకు లక్ష 50 వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి? అని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బాధితులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ బృందం..వీడియో 

Here's Video:

గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ తెచ్చింది.

పాపం 9 నెలల నిండు గర్భిణి నెల రోజుల నుండి నిద్ర పోతలేను అన్న కంటి మీద కునుకు లేదని బాధ పడుతుంది..నిన్న తెలంగాణ భవన్లో అక్క, చెల్లలు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్లు ఆగలేదు అన్నారు.ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండేనా? మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరుగుతుంది, కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరగడం లేదు అన్నారు. దేశాన్ని కాపాడిన జవాన్లు తమ ఇంటిని కాపాడుకొలేకపోతున్నామని ఆవేదన పడుతున్నారు అన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ తెచ్చింది...ఆ చట్టం ప్రకారం ఇల్లు కులిస్తే ఆ ఇంటి విలువకు మూడింతలు ఎక్కువ నష్ట పరిహారం కట్టించాలన్నారు. ఆ ఇంట్లో 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వారి జీవనోపాధి కోసం 5 లక్షలు ఇవ్వాలి..వాళ్లకి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు.ఇక్కడ కొందరు చోట మోట లీడర్లు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని గోప్పలు చెప్పుకుంటున్నారు...కానీ ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ ప్రకారం బాధితులకు అన్ని కల్పించాకే వాళ్ల ఇంట్ల దగ్గరికి వెళ్లాలన్నారు.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).