KTR Slams CM Revanth Reddy: కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా?..కేటీఆర్ ఫైర్, ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు.ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా అని ఎద్దేవా చేశారు.

KTR Slams CM Revanth Reddy: కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా?..కేటీఆర్ ఫైర్, ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
BRS Working President KTR Lashes Out Congress Govt Over Farmers Issue( X)

Hyd, Sep 20: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు.ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా అని ఎద్దేవా చేశారు.

అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడని దుయ్యబట్టారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు.

కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండా బద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు...నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ? అన్నారు.   కాళేశ్వరం కమిషన్‌ మళ్లీ విచారణ, రేపటి నుండి 25 మందిని బహిరంగ విచారణ చేయనున్న కమిషన్

Here's Tweet:

 కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..?,420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు ?చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..?

అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..?ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన అన్నారు. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ…నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు...గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు అన్నారు. ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

(The above story first appeared on LatestLY on Sep 20, 2024 12:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).