Nalgonda Road Accident: నార్కట్‌పల్లిలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..డ్రైవర్ మృతి, 8 మందికి తీవ్రగాయాలు
శనివారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి మండలం లొంగోటం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.
శనివారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి మండలం లొంగోటం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. బీహెచ్‌ఈఎల్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. గాయపడిన ఎనిమిది మంది ప్రయాణికుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి
(The above story first appeared on LatestLY on Oct 28, 2023 04:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

