CM KCR On Budget 2022: కేంద్ర బడ్జెట్‌ మాటల గారడీ తప్ప ఏమీ లేదు, ఇదొక దిక్కుమాలిన, పనికిమాలిన, పసలేని బడ్జెట్, సీఎం కేసీఆర్ ఆగ్రహం

"కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

CM KCR On Budget 2022: కేంద్ర బడ్జెట్‌ మాటల గారడీ తప్ప ఏమీ లేదు, ఇదొక దిక్కుమాలిన, పనికిమాలిన, పసలేని బడ్జెట్, సీఎం కేసీఆర్ ఆగ్రహం
Telangana CM KCR | File Photo

కేంద్రప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మోదీ ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టారు. 2022-23 కేంద్ర బడ్దెట్ వల్ల అందరూ నిరాశ చెందారని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను, దేశ రైతాంగాన్ని, సామాన్యులను, పేదలను, వృత్తి కులాలవారిని, ఉద్యోగులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసిందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అలాగే వేతన జీవుల కోసం ఇన్కమ్ టాక్స్ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం విచారకరమన్నారు. లోక్ సభలో బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ ప్రసంగం పూర్తిగా డొల్లతనంతో నిండి, మాటల గారడీతో కూడుకుందని కేసీఆర్ ఆరోపించారు.

"కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దశ దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటల గారడీతో కూడి వున్నదని అని సీఎం అన్నారు."

రేపు 11 గంటలకు బడ్జెట్‌పై ప్రధాని స్పీచ్, వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది, నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టామని తెలిపిన ప్రధాని మోదీ

" కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా, నిస్పృహలకు గురిచేస్తూ, మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సీఎం అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని సీఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను, చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్ కం టాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సీఎం అన్నారు."

"ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురుచూసారని, వారి ఆశల మీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందన్నారు. వైద్యం తదితర ప్రజా ఆరోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి పరచడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు. ''ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని" సీఎం అన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలికవసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు."

(The above story first appeared on LatestLY on Feb 01, 2022 07:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).