కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. 1. ప్రధాని గతిశక్తి యోజన 2. సమీకృత అభివృద్ధి 3. అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు 4. పరిశ్రమలకు ఆర్థిక అండ ఈ అంశాలను ఆధారంగా చేసుకుంటూ బడ్జెట్ రూపొందించాము. దేశ యువత ఉజ్వల భవిష్యత్‌కు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది.
ఉద్యోగాలు, మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించింది. ఈ బడ్జెట్‌లో భారత రక్షణకు పెద్దపీట వేశాం. బడ్జెట్‌లో మహిళల కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షమ్ అంగన్‌వాడీల రూపకల్పన వంటి 3 ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం. గంగానది తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ప్రయాణిస్తోంది. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. నవశకానికి నాంది పలికేలా ఈ బడ్జెట్ ఉంది' అని ప్రధాని నరంద్ర మోదీ అన్నారు. ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి సీతారామన్ పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. రేపు 11 గంటలకు బడ్జెట్ పై తన ప్రసంగాన్ని వివరణాత్మకంగా వివరిస్తానని ప్రధాని అన్నారు.
I congratulate Finance Minister Nirmala Sitharaman for this 'People Friendly and Progressive budget'.
I will speak in detail on the Budget at 11 am tomorrow: PM Modi. pic.twitter.com/GPGMHcWMvJ
— ANI (@ANI) February 1, 2022
Speaking on #AatmanirbharBharatKaBudget 2022. https://t.co/vqr6tNskoD
— Narendra Modi (@narendramodi) February 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)