ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైసీపీ నిప్పులు చెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరేలా కనిపించట్లేదని పేర్కొంది. ఈ బడ్జెట్‌పై తాజాగా వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి మాట్లాడారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించారని వరుదు కళ్యాణి తప్పుపట్టారు.
కొన్ని పత్రికల్లో ఇది బాహుబలి బడ్జెట్ అని వేశారు..ఇది బాహుబలి బడ్జెట్ కాదు కట్టప్ప బడ్జెట్ అధ్యక్షా...తీరా చూసాక బాహుబలిని కట్టప్ప ఎలా వెన్నుపోటు పొడిచాడో అలా ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అని వరుదు కల్యాణి అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకానికి వరుసగా రెండు బడ్జెట్‌లల్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదంటూ వరుదు కల్యాణి విమర్శించారు.
YSRCP MLC Varudu Kalyani Slams Chandrababu Kuatami Budget
కొన్ని పత్రికల్లో ఇది బాహుబలి బడ్జెట్ అని వేశారు..ఇది బాహుబలి బడ్జెట్ కాదు కట్టప్ప బడ్జెట్ అధ్యక్షా...
తీరా చూసాక బాహుబలి నీ కట్టప్ప ఎలా వెన్నుపోటు పొడిచాడో అలా ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు
- వరుదు కల్యాణి 🔥🔥 pic.twitter.com/Un5yWI4Fnd
— Rahul (@2024YCP) March 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)