ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విమర్శలు గుప్పించారు. కేవలం మూడు భాషలు కాదు, బహుళ భాషలు ఎందుకు ఉండకూడదు? నేను 10 భాషలను ప్రోత్సహిస్తాను అని చెప్పుకొచ్చారు. నిన్న ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ..త్రిభాషా ఫార్ములాను వ్యతిరేకిస్తూ తమిళనాడు చేపట్టిన ఉద్యమాలను తప్పుపట్టారు.  హిందీ నేర్చుకోవడం ఎంతో మంచిదని వ్యాఖ్యానించారు. దీనివల్ల దేశ ప్రజలతో కలిసి పోవచ్చని అన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రాణాంచాలంటే ఇంగ్లీష్‌ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నానని, ఏపీలో తెలుగును మాతృభాషగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. మూడు భాషలే కాదు, పలు భాషలను నేర్చుకోవడాన్ని సమర్థిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు.

బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

కాగా డీఎంకే ప్రభుత్వం- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- 2020ని విభేదిస్తోన్న విషయం విదితమే. కాగా తమిళనాడులో జాతీయ నూతన విద్యా విదానాన్ని అమలు చేసి, త్రిభాషా ఫార్ములాను ప్రవేశపెట్టేంత వరకు సమగ్ర శిక్ష కార్యక్రమం కింద నిధులు అందించబోమంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తమిళులు అలాంటి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోరంటూ సీఎం స్టాలిన్ ఘాటుగా బదులిచ్చారు.

CM Chandrababu Naidu on languages

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)