ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చేముందు తెలియదా చంద్రబాబు నాయుడు? అంటూ ఏపీ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. ఇక పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని కేఏ పాల్ మండిపడ్డారు. రూ.50 మందు రూ.150కి అమ్ముతున్నావు అని జగన్ మీద పవన్ తమ్ముడు కామెంట్ చేశాడు. ఇప్పుడు మీరు కల్తీ మందు వాళ్ల కంటే దారుణంగా అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇక రెండు రోజుల క్రితం వైసీపీ నుంచి గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యే లు రాజీనామా చేయాలని, ప్రజలకోసం వైసీపీ నాయకులు అసెంబ్లీ కి వెళ్లి సూచించారు.
ప్రజాశాంతి పార్టీ కి ఒక్క ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా ప్రజల సమస్యల పై నిరంతరం పోరాడుతుందన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ర్టంలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని ఆరోపించారని, ఇప్పడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కి సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేతకాదు అన్నారు. పవన్ రాజకీయాలకు పనికిరాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
KA Paul Slams Pawan Kalyan And Chandrababu
ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చేముందు తెలియదా చంద్రబాబు నాయుడు?
పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు – కేఏ పాల్ pic.twitter.com/l87MoH9kSq
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసిన కెఏ పాల్
రూ.50 మందు రూ.150కి అమ్ముతున్నావు అని జగన్ మీద పవన్ తమ్ముడు కామెంట్ చేశాడు
ఇప్పుడు మీరు కల్తీ మందు వాళ్ల కంటే దారుణంగా అమ్ముతున్నారు - కెఏ పాల్ pic.twitter.com/OAcxsCzQSR
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)