YSRCP Reaction on AP Budget: బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు, ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని వెల్లడి

ఈ బడ్జెట్ వైసీపీ మండిపడింది. కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

YSRCP Reaction on AP Budget: బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు, ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని వెల్లడి
Chandrababu and Jagan (Photo-X/Video grab)

Vjy, Feb 28: ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.

ఈ బడ్జెట్ వైసీపీ మండిపడింది. కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు’’ అని బొత్స నిలదీశారు.

రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌, ఏ శాఖకు ఎంత కేటాయించారో పూర్తి వివరాలు ఇవిగో, వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు

గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు.రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వాన్ని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్‌ని పొగడడం తప్ప ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదు.

షూరిటీ కాదు.. ప్రజల మోసం అనాలి. మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలి.. కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు. ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదు. 50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం’’ అని బొత్స పేర్కొన్నారు.

అన్నదాత సుఖీభవ ఇస్తే రూ.12 వేల కోట్లు కావాలి. మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదు. ఉచిత బస్సు మాట లేదు.. ఉలుకు పలుకే లేదు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో 3వేల కోట్లు మార్కేట్ ఇంటర్వెన్షన్ కోసం పెడితే.. ఇప్పుడు సున్నా తీసేసి 300 కోట్లు పెట్టారు. మిర్చి రైతుల సమస్య పై పోరాటం చేస్తే జగన్‌పై కేసు పెట్టారు. ఒక్కో కిలో, ఒక్క క్వింటా, ఒక్క బస్తా అయినా కొన్నారా?. ఎంతసేపు పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ పై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా. ప్రజలనిమాటలతో గారడి చేసి మోసం చేసే బడ్జెట్ ఇది.’’ అంటూ బొత్స ధ్వజమెత్తారు.

చంద్రబాబు, లోకేష్ ని పొగిడేందుకే సభ సరిపోయింది. వెనుక బడిన తరగతుల అభివృద్ధి కి కేటాయింపులు లేవు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారు. నిరుద్యోగులకు 3వేల హామీ బడ్జెట్‌లో లేదు. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేకుండా సంపద సృష్టి అంటే కేవలం మోసం చేయడమేనని ఎమ్మెల్సీ రవిబాబు అన్నారు.

ఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మోసం చేశారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ అమలు చేయలేదు.  గత ప్రభుత్వాన్ని తిట్టడం, లోకేష్‌ని పొగడడం పనిగా పెట్టుకున్నారు. లోకేష్‌ని పోగిడే దానిపై పెట్టిన శ్రద్ధ.. బడ్జెట్‌పై పెడితే బాగుండేది. బడ్జెట్‌పై చర్చలో హామీల అమలు గురించి ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు.

ఆడబిడ్డ నిధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. వైఎస్‌ జగన్‌ ఐఆర్‌ ప్రకటించడంతో ఉద్యోగులను హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఒక్క ఐఆర్‌ కూడా ప్రకటించలేదు. మెగా డీఎస్సీ అన్నారు. నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. 5 లక్షల మంది కోచింగ్స్ తీసుకొంటున్నారు. నిరుద్యోగ భృతి గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు.  ఉన్నత విద్య మండలిలో తప్పులపై ఎంక్వయిరీ చేయిస్తామని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్ల బడ్జెట్‌లో పేదలకు ఒరిగేదేమీ లేదు. లక్ష కోట్ల అప్పులు తెచ్చిన మీరు అవి ఏం చేశారో చెప్పాలి. గట్టిగా అడిగితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కేసులు పెడుతున్నారు’’ అని బొమ్మి ఇజ్రాయెల్‌ మండిపడ్డారు.

(The above story first appeared on LatestLY on Feb 28, 2025 02:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).