CM KCR Press Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన, రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు పోతోందని ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు పోతోందని ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేయటం ద్వారా.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం వైఖరిపై నిరసన తెలియజేయడానికి దీనిని ఉత్తమైన మార్గంగా భావిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. బహిరంగ లేఖ ద్వారా ప్రధాని మోదీకి తనన నిరసనను నేరుగా తెలియజేయనున్నట్టుగా తెలిపారు.
‘నాకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎంతో గౌరవం ఉండేది. దేశ అభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రణాళికలపై విశ్లేషణ జరిగేది. ప్రజాధనం ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని గతంలో పీపీఏపీ కమిటీ ఏర్పాటు చేశారు. హరిత విప్లవం అనే ఉద్యమం నెహ్రూ కాలంలో వచ్చింది. అప్పట్లో మంచి సలహాలు, సూచనలు చేస్తే ప్రధానులు స్వీకరించి అమలు చేసే వాళ్ళు. కానీ ఇప్పటి ప్రధానులు అలా లేరు.
Watch Live: CM Sri KCR addressing the media from Pragathi Bhavan https://t.co/wjTr7gTe6J
— Telangana CMO (@TelanganaCMO) August 6, 2022
ఎస్ కె డే ఇచ్చిన సలహాలు, సూచనలు నెహ్రూ స్వీకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నెహ్రూ చేసిన అభివృద్ధి చూసి ఎస్ కె డే ఇండియా వచ్చారు. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ప్రణాళికలు నెహ్రూ కాలంలో జరిగాయి. 2014లో మోడీ రాగానే నీతి ఆయోగ్ అని తెచ్చారు. నీతి ఆయోగ్ తెచ్చిన్నపుడు దేశానికి మంచి రోజులు వచ్చాయి అనుకున్నా. నీతి ఆయోగ్ ను టీం ఇండియా అని సంబోధించారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ కలిసి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడం దీని ఉద్దేశం.
(The above story first appeared on LatestLY on Aug 06, 2022 05:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

