Corona For120 Doctors at Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా పంజా, 120 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్యులకు కరోనా సోకింది. మరో వైపు ఉస్మానియా, ఎర్రగడ్డలోని మానసిక వైద్య శాలలో కూడా కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర ఆస్పత్రులలో చేరుతున్న పాజిటివ్‌ పేషంట్ల సంఖ్య పెరుగుతోంది.

Corona For120 Doctors at Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా పంజా, 120 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్
Coronavirus outbreak | (Photo Credits: IANS)

హైదరాబాద్, జనవరి 18: రోనా పంజా విసురుతోంది. వైరస్‌ భారిన పడిన పేషంట్లకు చికిత్స అందించే వైద్యులు కూడా కరోనా వైరస్‌ భారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. మరో వైపు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా ఆస్పత్రులలో పాజిటివ్‌ పేషంట్ల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్యులకు కరోనా సోకింది. మరో వైపు ఉస్మానియా, ఎర్రగడ్డలోని మానసిక వైద్య శాలలో కూడా కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర ఆస్పత్రులలో చేరుతున్న పాజిటివ్‌ పేషంట్ల సంఖ్య పెరుగుతోంది. ఆదివారంనాడు 2158 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో పాజిటివ్‌ పేషంట్లు ఉండగా, ఆ సంఖ్య సోమవారం నాటికి 2366 మందికి చేరింది. కరోనా సేవ అందించే వారిలోనూ వైరస్‌ సోకడం పట్ల పలువురిలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో రెండు వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తున్న వారికి వైద్యులు ప్రత్యేకంగా థర్మల్‌ స్కీనింగ్‌ నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో సుమారు 120మంది డాక్టర్లు కరోనా భారిన పడ్డారు. ఇందులో 40 మంది పిజి విద్యార్థులు, 38 మంది హౌస్‌ సర్జన్లు, 35 మంది ఎంబిబిఎస్‌, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నారు. మరి కొందరు వైద్య సిబ్బంది కరోనా రిపోర్టులు రావాల్సి ఉన్నది. మరో వైపు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో 9 మంది వైద్య సిబ్బందితో పాటు 57 మంది రోగులకు వైరస్‌ సోకింది. తీవ్ర లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌లో పెట్టినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమాశంకర్‌ తెలిపారు. కొవిడ్‌ లక్షణాలు కలిగిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు పోలీసు శాఖలో కూడా విపరీతంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

(The above story first appeared on LatestLY on Jan 18, 2022 09:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).