Coronavirus in Telangana: నిలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల చిన్నారికి కరోనా, తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు, 16 కేసులు హైదరాబాద్‌లోనే..

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

Coronavirus in Telangana: నిలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల చిన్నారికి కరోనా, తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు, 16 కేసులు హైదరాబాద్‌లోనే..
Representational (Credits: Twitter/ANI)

Hyd, Dec 22: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో పిల్లల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు కోవిడ్ నిర్ధారణ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం, ఏపీలో రెండు, తెలంగాణలో ఆరు కేసులు నమోదు, హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కోవిడ్

నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్‌ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. కోవిడ్‌ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు వైద్యులు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రజలు ఆందోళన పడొద్దని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్లి రాలేదని స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Dec 22, 2023 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).