Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసుపై విచారణకు హాజరవ్వండి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు.. మాజీ మంత్రి హరీశ్‌ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి కూడా సమన్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది.

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసుపై విచారణకు హాజరవ్వండి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు.. మాజీ మంత్రి హరీశ్‌ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి కూడా సమన్లు
Telangana CM K. Chandrashekhar Rao. | File Photo.

Hyderabad, Aug 6: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌ కు నోటీసులు పంపించింది. కేసీఆర్‌ తో పాటు మాజీ మంత్రి హరీశ్‌ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబరు 5న విచారణకు రావాలని కోర్టు స్పష్టం చేసింది.

వీడియో ఇదిగో, స్టేజీ మీదనే యాంకర్ సుమ చేతికి ముద్దు పెట్టిన హాలీవుడ్ న‌టుడు డానియెల్‌, అన్నయ్యా రాఖీ వస్తుంది కదా అంటూ సుమ..

ఎవరు ఈ కేసు వేశారు?

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై పోలీసులతో సమగ్ర విచారణ చేయించాలంటూ 2023 నవంబరు 7న భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి  భూపాలపల్లి స్థానిక కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ ఆ కోర్టు కొట్టివేయగా.. పిటిషనర్ ఇటీవలే భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ప్రజాధనంతో నిర్మితమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని, దీనిపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన పిటిషన్‌‌ ను కోర్టు పరిశీలించింది. తాజాగా నోటీసులు పంపించింది.

తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్ పిటిషన్

(The above story first appeared on LatestLY on Aug 06, 2024 08:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).