Yadagirigutta Dhanurmasam Celebrations: నేటి నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
Yadagirigutta, Dec 17: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు (Dhanurmasam) వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి 30 రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో భాగంగా ప్రతీ రోజు వేకువజామున 4.30 నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖమండపంపై ఉత్తర భాగంలోని హాలులో అమ్మవారికి వేంచేపు వేసి తిరుప్పావై నిర్వహిస్తారు. అదేవిధంగా గోదాదేవి వ్రతపర్వ, మార్గళి, పాశురాల పఠనం నిర్వహించనున్నారు. జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, 15న ఉదయం ఒడిబియ్యం సమర్పణ జరుగుతుందని ఆలయ ఈవో గీత తెలిపారు.

క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు
ఆదివారం కావడంతో యాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నది.
(The above story first appeared on LatestLY on Dec 17, 2023 09:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

