Formula E Race Case: కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదు, కేటీఆర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెనుదిరిగారు. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు

Formula E Race Case: కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదు, కేటీఆర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ
KTR Key Comments On Rythu Bharosa, slams cm revanth reddy(X)

Hyd, Jan 6: ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెనుదిరిగారు. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్లతో వచ్చానన్నారు. లీగల్‌ టీమ్‌తో రావద్దని నోటీసుల్లో ఉందా, ఉంటే చూపించాలని పోలీసు అధికారులను ప్రశ్నించారు.

కేటీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో.. ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారు. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్‌(KTR) ఆ స్టేట్‌మెంట్‌ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్‌ పిటిషన్‌ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్‌ కోరారు.

ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగిన కేటీఆర్.. తన లాయర్ ను లోపలికి అనుమతించకపోవడంతోనే.. (లైవ్ వీడియో)

ఇదిలా ఉంటే విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ చర్యలకు ఉపక్రమించబోతుందని సమాచారం. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్‌ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు.

అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్‌ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).