COVID in TS: హైదరాబాద్‌లో కరోనావైరస్ ఉగ్రరూపం, ఒక్కరోజులో 1500పైగా కేసులు, తెలంగాణ వ్యాప్తంగా మరో 1850 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 22 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్ నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శుక్రవారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 1658 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, శనివారం రోజు కూడా దాదాపు అదే స్థాయిలో 1,572 మందికి పాజిటివ్ అని తేలింది...

COVID in TS: హైదరాబాద్‌లో కరోనావైరస్ ఉగ్రరూపం, ఒక్కరోజులో 1500పైగా కేసులు, తెలంగాణ వ్యాప్తంగా మరో 1850 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 22 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య
Corona in Hyderabad (photo-Youtube grab)

Hyderabad, July 4:  తెలంగాణ రాష్ట్రంలో శనివారం కూడా భారీ స్థాయిలోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 1850 మంది కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 22,312 కి చేరుకుంది.

ఇక హైదరాబాద్ నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శుక్రవారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 1658 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, శనివారం రోజు కూడా దాదాపు అదే స్థాయిలో 1,572 మందికి పాజిటివ్ అని తేలింది.

హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు రంగారెడ్డి నుంచి 92 కేసులు రాగా, మేడ్చల్ నుంచి 53 కేసులు వచ్చాయి. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కరోనావైరస్ విజృంభిస్తుంది. ఈరోజు వరంగల్ అర్బన్ నుంచి 31 కేసులు నమోదయ్యాయి.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana's COVID Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

 

మరోవైపు  గత 24 గంటల్లో మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 288 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో పెద్ద మొత్తంలో మరో 1,342 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 11,537 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో  10,487 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 6,427 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,10,545మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jul 04, 2020 09:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).