Inhumanity in Siddipet: సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో
మానవ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఎవరో అన్నట్టు.. డబ్బుల కోసం మనుషులు క్రూరత్వానికి తెగబడుతున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు.
Siddipet, Aug 17: మానవ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఎవరో అన్నట్టు.. డబ్బుల కోసం మనుషులు క్రూరత్వానికి తెగబడుతున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు (Tree) కట్టేసి దాడి చేశాడు. సభ్యసమాజం ముక్కునవేలు వేసుకునేలా ఉన్న ఈ ఘటన సిద్దిపేట (Siddipet) పట్టణంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట పట్టణానికి చెందిన పరశురాములు తన అవసరాల నిమిత్తం సొంత తమ్ముడు కనకయ్య వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. అయితే, తీసుకున్న మొత్తానికి రూ.20 వేల వడ్డీ అయ్యిందని, మిగిలిన ఆ వడ్డీ డబ్బులు ఇవ్వాలని కనకయ్య అన్న పరుశురాములుని వేధించాడు. కౌన్సిలర్ దగ్గరికీ పంచాయితీ పోయినా తెగలేదు.
అప్పు తీసుకొని 20 వేలు తక్కువ ఇచ్చాడని అన్న, వదినను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు.
సిద్దిపేటలో అన్న పరుశురాములుకు రూ. 1,20,000 అప్పుగా ఇచ్చిన తమ్ముడు కనకయ్య.. లక్ష రూపాయలు తిరిగి ఇచ్చిన అన్న పరుశురాములు.
రూ.20 వేలు ఎందుకు ఇవ్వలేదని అన్న, వదినను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు కనకయ్య..… pic.twitter.com/vmvwusz644
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2024
కోపంతో కట్టేశాడు
దీంతో కోపంతో అన్నను లాక్కొచ్చి నాసర్ పురాలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలోని చెట్టుకు కనకయ్య కట్టేశాడు. అడ్డువచ్చిన వదినను సైతం కట్టేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కనకయ్యపై కేసు నమోదు చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 17, 2024 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

