KTR Questions CM Revanth Reddy: పడకేసిన పల్లెలు, కంపు కొడుతున్న పట్టణాలు?, ఇదేనా ప్రజా పాలన అంటే మండిపడ్డ కేటీఆర్

రాష్ట్రంలో పల్లెలు పడకేశాయన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు.

KTR Questions CM Revanth Reddy: పడకేసిన పల్లెలు, కంపు కొడుతున్న పట్టణాలు?, ఇదేనా ప్రజా పాలన అంటే మండిపడ్డ కేటీఆర్
KTR lashes out Congress and CM Revanth Reddy on Villages Development!

Hyd, Aug 14:  రాష్ట్రంలో పల్లెలు పడకేశాయన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్.

అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రకారం...కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి..ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది...పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందన్నారు.

దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని, పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. నాడు.. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్ గా రూ.275 కోట్లు విడుదల చేశాం..నేడు.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్ లపై నిర్బంధాలు.. అక్రమ అరెస్టులు అన్నారు.

15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారు..?,ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారు..??,12,769 పంచాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ.4305 కోట్లని అంచనా. వాటి పరిస్థితి ఏంటి..???,దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యం అన్నారు.

కాంగ్రెస్ పాలనలో.. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే.. ఇక పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి...గ్రేటర్ తోపాటు.. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో.. మహానగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా ?,కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో.. పల్లె ప్రగతికి పాతరేసి.. పట్టణ ప్రగతిని అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా ? ఆలోచించాలన్నారు.  హైదరాబాద్‌ మెట్రోకు నిధులేవి, 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఇచ్చింది గుండు సన్నా?, తెలంగాణపై మోడీకి నిలువెల్లా విషమే,కేటీఆర్ ఫైర్ 

Here's Tweet:

మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదు.. కొత్త పనులకు ప్రణాళిక లేదు,నిధులు లేక పూర్తిగా నీరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మత్తులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా ?,వర్షాకాలంలో అధ్వాన్నంగా మారిన రోడ్లతో ప్రతినిత్యం అవస్థలు పడుతున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు ??,మున్సిపాలిటీల్లో రూ.1200 కోట్లకుపైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారు అని ప్రశ్నించారు.

మున్సిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల మరమ్మత్తులను యుద్ధప్రాతిపదికన చేపట్టే ఆలోచన ఉందా ?? బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం మీ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం.. మీ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోకండని సూచించారు.

(The above story first appeared on LatestLY on Aug 14, 2024 12:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).