KTR Slams CM Revanth Reddy: పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది..చిల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టం, దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు వస్తుందన్న కేటీఆర్

సీఎం అంటే ఇప్పుడు కటింగ్ మాస్టర్ అయిపోయాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన కేటీఆర్.. పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది అన్నారు.

KTR Slams CM Revanth Reddy: పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది..చిల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టం, దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు వస్తుందన్న కేటీఆర్
KTR Slams CM Revanth Reddy at Siricilla(BRS X)

Siricilla, January 4:  సీఎం అంటే ఇప్పుడు కటింగ్ మాస్టర్ అయిపోయాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన కేటీఆర్.. పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్సే ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం... ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది, కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకండి. కేసులైనా భయపడకండి. చిట్టినాయుడు ఏం పీకలేడు అన్నారు.

చిల్లర మల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టం అన్నారు. బాక్సింగ్ లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు ... కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలైన్రు కానీ వచ్చింది మాత్రం గుండు సున్నా అన్నారు. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది... కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు రూ. 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్ కు అప్పజెప్పాం అన్నారు.

రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట... పదేళ్లలో రూ. 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో రూ. 1 లక్షా 37 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా?, ఈ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది? అన్నారు. పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నారు. ఢిల్లీకి తెలంగాణా ఏటీఎం అయిపోయిందన్నారు.  తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు, అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న కేటీఆర్ 

కొడంగల్ భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే యత్నం చేశారు... ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. వాళ్లు కేసుల గురించి ఆలోచిస్తుంటే.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం... త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించి, బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం అన్నారు. రైతు భరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి... కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు? మళ్ళీ ఈ రైతు ప్రమాణ పత్రాలెందుకు? అన్నారు.

(The above story first appeared on LatestLY on Jan 04, 2025 07:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).