MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

నిన్న సినీ హీరో అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై స్పందించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పుష్ప 2 సినిమా కోసం సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ నిన్న హడావుడిగా ఒక ప్రెస్ మీట్ లో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారనుకున్నామన్నారు.

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ
MP Chamala Kiran Kumar Reddy Slams Allu Arjun(X)

Hyd, December 22:  నిన్న సినీ హీరో అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై స్పందించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పుష్ప 2 సినిమా కోసం సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ నిన్న హడావుడిగా ఒక ప్రెస్ మీట్ లో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారనుకున్నామన్నారు.

ప్రెస్ మీట్ లో బట్టి పట్టి రియల్ హీరోగా కాకుండా రిల్ హీరోగా ప్రవర్తించిన తీరు కనబడుతుందని మండిపడ్డారు. మీరు మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగద్దనే ఉద్దేశంతోనే టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుంది..

రానున్న రోజులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బెన్ఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు అన్నారు.

ఆరోజు సంధ్య థియేటర్లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది అంతా గందరగోళంగా ఉంది ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదు...మీకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప, ప్రజలు ఏమైతుండ్రు బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదు అన్నారు. మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉందన్నారు. అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదు నిన్నటి ప్రెస్ మీట్ లో బన్నీ మాట్లాడిన తీరు ఉందన్నారు. ఒక బాధ్యత యుతంగా ఉండాలి కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దు...నా క్యారెక్టర్ ను దెబ్బతీశారు అనడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమాలోనే హీరో కాదు బయట కూడా హీరోలాగా వివరించాలని అల్లు అర్జున్ ని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).