Pushpa2 The Rule Movie Allu Arjun Entry Scene Video Leaked in Social media

Hyderabad, Dec 22: అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప- 2 (Pushpa 2) సినిమాపై, ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించడంపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. పుష్ప-2 ఘటన విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని నారాయణ ఆరోపించారు. స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించిన అదొక సినిమానా? అని ప్రశ్నించారు. అలాంటి సినిమాకు రాయితీ ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆదర్శ నటులైన అల్లు తరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ మహిళ తన కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణాలను బలిపెట్టిందని, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుని ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు.

సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

నా వంతు సాయం

సంధ్య సినిమా హాలు ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆ కుటుంబానికి తమవంతు సాయం అందిస్తామని ప్రకటించారు.

ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు, అల్లు అర్జున్ అసలు మనిషేనా?..అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్