Saudi Arabia Attacks: సౌదీ అరేబియాపై హౌతీల దాడులు.. అమెరికా ఎంట్రీతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు.. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ పెను సంక్షోభం తప్పదా..
మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమై, ప్రాంతీయ యుద్ధంగా రూపాంతరం చెందే ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన విధ్వంసకర దాడులు, దానికి ప్రతిస్పందనగా యెమెన్‌లో సౌదీ మద్దతుతో జరుగుతున్న విస్తృత సైనిక చర్యలు ఈ ప్రాంతంలో తీవ్ర అశాంతిని రాజేశాయి.
Saudi Arabia Attacks: మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమై, ప్రాంతీయ యుద్ధంగా రూపాంతరం చెందే ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన విధ్వంసకర దాడులు, దానికి ప్రతిస్పందనగా యెమెన్‌లో సౌదీ మద్దతుతో జరుగుతున్న విస్తృత సైనిక చర్యలు ఈ ప్రాంతంలో తీవ్ర అశాంతిని రాజేశాయి. ఈ ఘర్షణల్లో అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తుండటంతో పాటు, ఇటీవల సౌదీతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న టర్కీ, పాకిస్థాన్‌లు కూడా ఈ సంక్షోభంలో భాగస్వాములు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని హూతీలు శనివారం జరిపిన భారీ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరుసటి రోజు ఆదివారం జరిగిన మరో దాడిలో ఒకరు మరణించగా 11 మంది గాయపడ్డారు. యెమెన్ రాజధాని సనాపై సౌదీ యుద్ధవిమానాలు జరిపిన వైమానిక దాడులకు నిరసనగానే ఈ ప్రతిదాడులు చేపట్టినట్లు హూతీలు ప్రకటించారు. పాకిస్తాన్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గవర్నర్ పాలన.. మంటల్లో తగలబడిన గవర్నర్ హౌస్..
ప్రపంచ వాణిజ్య నౌకాయానానికి అత్యంత కీలకమైన 'బాబ్ అల్ మందేబ్' జలసంధి సమీపంలో హౌతీలు తమ పట్టును బిగించేందుకు ప్రయత్నించగా, సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఎదురుదాడికి దిగి వ్యూహాత్మక మొఖా ఓడరేవును తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. దీంతో కంగారుపడ్డ హూతీలు సౌదీ భూభాగంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులను ముమ్మరం చేశారు.
ఈ దాడుల దాటికి సౌదీలో ఓ అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సైనిక చర్య తీసుకోవాలనే ఒత్తిడి పెరిగింది. హూతీలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేస్తుందా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. సౌదీ అరేబియాకు గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం , అత్యవసర నిహు సమాచారాన్ని అందించడం తక్షణ అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇరాన్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్న హూతీలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్‌తో నేరుగా పోరుకు తెరలేపకూడదనే యోచనలో వాషింగ్టన్ వర్గాలు ఉన్నాయి. మరోవైపు, ఆగస్టులో సౌదీతో కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న టర్కీ, పాకిస్థాన్‌లు సౌదీ భద్రతకు సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ, ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే విషయాన్ని టర్కీ తోసిపుచ్చింది.
ఈ పరిణామాలు సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థపై , అంతర్జాతీయ చమురు, వాణిజ్య మార్గాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సౌదీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులకు రియాద్‌పై జరిగిన దాడులు పెద్ద ప్రతిబంధకంగా మారాయి. ఇరాన్ రూపకల్పన చేసిన అత్యంత చవకైన బాలిస్టిక్ క్షిపణులు, సుదూర ప్రాంతాలను చేరే డ్రోన్లు హూతీల వద్ద ఉండటం సౌదీ డిఫెన్స్ వ్యవస్థలకు తీవ్ర సవాలుగా మారింది. అమెరికా సైతం ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే, ఇది కేవలం యెమెన్, సౌదీలకే పరిమితం కాకుండా మొత్తం మధ్యప్రాచ్యాన్ని దహించివేసే సుదీర్ఘ ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదముందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 12, 2026 12:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

