Harishrao: రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే కుట్ర..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో షేర్ చేసిన హరీశ్‌ రావు, రైతులను మోసం చేసి రైతు పండుగ నిర్వహిస్తారా అని ఫైర్

సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన వీడియోను షేర్ చేసిన హరీశ్‌....రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం అన్నారు.

Harishrao: రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే కుట్ర..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో షేర్ చేసిన హరీశ్‌ రావు, రైతులను మోసం చేసి రైతు పండుగ నిర్వహిస్తారా అని ఫైర్
No Rythu Bandhu, No Bharosa...BRS protest against Congress(X)

Hyd, Nov 30:  సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన వీడియోను షేర్ చేసిన హరీశ్‌....రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం అన్నారు.

ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గం అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమేనని...అదే రైతుబంధు కింద ఏడాదికి రూ. 7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందన్నారు. మీరు మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ. 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది...మరి రైతు బంధు కంటే, బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లవుతుందో వ్యవసాయ మంత్రి , రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి, సగం మందికి మొండి చేయి చూపారు...ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని, చివరకు సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారు అన్నారు. ఇప్పుడు రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధును బందు చేస్తారని కేసీఆర్ గారు ముందే హెచ్చరించారు. అనుకున్నట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు. రైతు భరోసా వస్తదని ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా? చెప్పాలన్నారు.  జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్..చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం, లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయమన్న కేటీఆర్

Here's Video:

రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ రెడ్డి? ..మేనిఫెస్టోలో చెప్పి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా అని ప్రశ్నించారు. రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.ఇవాళ మహబూబ్ నగర్ లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వానకాలం రైతుబంధు తో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

(The above story first appeared on LatestLY on Nov 30, 2024 11:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).