Telangana Bhavan Turns Janatha Garage says KTR(BRS X)

Hyd, Nov 30:  లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం.. తెలంగాణ ప్రజల విజయం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం... ఆత్మగౌరవం, అస్తిత్వం, అస్మిత.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతం అన్నారు.

కేసీఆర్ ఆనవాళ్లు కాదు.. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడు... కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోంది. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లా మారిందన్నారు. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడు... ఇక్కడున్న రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడు అన్నారు. ఉద్యమంపై గన్ను ఎక్కుపెట్టిన రేవంత్.. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని రెచ్చిపోతున్నడు.... సోనియమ్మ లేకపోతే తెలంగాణ అడుక్కు తినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్ సీఎం అన్నారు.

తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు ఓ పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క దాడి చేస్తున్నారు... ప్రస్తుత పార్లమెంట్ లో మన గళం వినిపించే నాథుడే లేడు. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే. ఇంకెవరూ కాదు అన్నారు. ఇది బీఆర్ఎస్ విజయం.. తెలంగాణ ప్రజల విజయం. గిరిజనులు, దళితులు, బీసీల, రైతుల విజయం అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 5 శాతం ఐఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి 

ఈ రియల్ ఎస్టేట్ బేహారీకి, పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు.. మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం...కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయ్యింది...మైనార్టీ సోదరులు కూడా మనవాళ్లు ఎవరో.. కానివాళ్లు ఎవరో గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసి ప్రయోజనం పొందారు...కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుందన్నారు.