Telangana Rains: హైదరాబాద్ కు పట్టిన ముసురు.. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ముసురు పట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Telangana Rains: హైదరాబాద్ కు పట్టిన ముసురు.. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
Rains

Hyderabad, Aug 19: నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ (Hyderabad) లో ముసురు పట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం (Rains) కురుస్తుంది. అటు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కూడా రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు అక్కడక్కడ పడతాయని వెల్లడించింది. ఆదివారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.

అల్పపీడన గమనం ఇలా..

గురువారం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడన ప్రదేశం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతోందని వివరించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాప్తించి ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 2-3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌ మీదుగా మళ్లే అవకాశం ఉందని వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on Aug 19, 2023 08:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).