Yadadri Bhuvanagiri Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, RTC బస్సు ఢీ కొని రోడ్డు పనులు చేసుకునే 4 గురు కూలీలు మృతి..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు మృతి చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ రెడ్డు వద్ద డివైడర్ పనులు చేస్తున్న కూలీలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. డివైడర్ ను ఢీకొన్న తర్వాత అక్కడే ఉన్న ట్రాక్టర్ ను కూడా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆలేరు, మార్చి 6 : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు మృతి చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ రెడ్డు వద్ద డివైడర్ పనులు చేస్తున్న కూలీలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. డివైడర్ ను ఢీకొన్న తర్వాత అక్కడే ఉన్న ట్రాక్టర్ ను కూడా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అందరూ కూలీలే... మృతులందరూ కూలీలుగానే గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉండి. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. ఈ సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే, వేగంగా వచ్చిన బస్సు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ట్రాక్టర్ కాస్తా పని చేస్తున్న కూలీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు స్పాట్‌లోనే చనిపోయాగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మృతులంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Mar 06, 2022 10:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

