Vaccination in TS: తెలంగాణలో చురుగ్గా కొనసాగుతున్న రెండో ఫేస్ కోవిడ్ వ్యాక్సినేషన్, తొలిరోజు 70 శాతం పైగానే టీకాల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో తొలిరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 75 శాతం వ్యాక్సినేషన్ జరిగిందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 62 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయబడుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోసుకు రూ. 250 ఛార్జ్ చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది....

Vaccination in TS: తెలంగాణలో చురుగ్గా కొనసాగుతున్న రెండో ఫేస్ కోవిడ్ వ్యాక్సినేషన్, తొలిరోజు 70 శాతం పైగానే టీకాల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Hyderabad, March 2: తెలంగాణలో రెండవ ఫేస్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది. 60 ఏళ్లు పైబడిన పౌరులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తున్నారు. లు. టీకా పొందేందుకు అర్హులైన పౌరులందరూ తమ పేర్లను అధికారిక వెబ్ సైట్ www.cowin.gov.in లో మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకోవాలి.  ఇందుకు సంబంధించి ఎలాంటి యాప్స్ లేవని ఆరోగ్య శాఖ పేర్కొంది.

కాగా, తెలంగాణలో తొలిరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 75 శాతం వ్యాక్సినేషన్ జరిగిందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 62 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయబడుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోసుకు రూ. 250 ఛార్జ్ చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇక వీరితో పాటు ఇప్పటికే టీకా పొందిన హెల్త్ కేర్ మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లకు రెండో మోతాదు టీకాల పంపిణీ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది.

ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 40,181 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 163 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 488 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,99,086కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 27 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 13, మరియు రంగారెడ్డి నుంచి 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరొక కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,635కు పెరిగింది.

మరోవైపు సోమవారం సాయంత్రం వరకు మరో 157 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,95,544 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1907 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Mar 02, 2021 10:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).