Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అందుకే గంజాయి సేవించా: బయటపడ్డ షణ్ముఖ్ సంచలన వీడియో
షణ్ముఖ్ జస్వంత్ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తన పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అందుకే గంజాయి తాగానని తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నటుడు, యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, అతని అన్నయ్య ఇటీవల గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరో సమాచారం బయటకు వచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ గంజాయి వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. షణ్ముఖ్ జస్వంత్ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తన పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అందుకే గంజాయి తాగానని తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడి గదిలో వెతకగా సోదరులు గంజాయి తాగుతూ కనిపించారు. తాజాగా సంపత్ వినయ్‌పై మరో కేసు నమోదైంది. ఎంబీఏ చదివిన యువతి నుంచి సంపత్ 20 లక్షలు తీసుకున్నాడని, వ్యాపారం పేరుతో మోసం చేసి డబ్బులు అడిగితే బెదిరించాడని యువతి ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి షణ్ముఖ్ జస్వంత్, అతని అన్నయ్య సంపత్ వినయ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.
నేను అందుకే గంజాయి తాగుతున్న: షణ్ముఖ్
గంజాయి ఎందుకు తాగుతున్నాడో పోలీసులకు సంచలన నిజాలు చెప్పిన షణ్ముఖ్.. వింటే నోరెళ్లబెడతారు#BREAKING #ShanmukhJaswanth #ShanmukhJaswant #Shanmukh #telugufilmnagar #ChotaNewsExclusive pic.twitter.com/6ZI32UzAz4
— ChotaNews (@ChotaNewsTelugu) February 25, 2024
(The above story first appeared on LatestLY on Feb 25, 2024 03:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

