COVID in TS: తెలంగాణలో లక్షకు చేరువైన కొవిడ్ కేసుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1967 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 737కు పెరిగిన కరోనా మరణాలు

ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ అర్బన్ నుంచి 101, వరంగల్ రూరల్ నుంచి 26 మరియు ములుగు జిల్లా నుంచి 11 కేసులు నిర్ధారించబడ్డాయి. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నుంచి 86, జగిత్యాల నుంచి 81, పెద్దపల్లి 35...

COVID in TS: తెలంగాణలో లక్షకు చేరువైన కొవిడ్ కేసుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1967 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 737కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

Hyderabad, August 21:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 26,767 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,967 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1300 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,48,078 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 99,391కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 473 మందికి COVID సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 202, మేడ్చల్ నుంచి 170 , మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 38 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

 ఇక ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కరోనా ఉధృతి తగ్గడం లేదు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ అర్బన్ నుంచి 101, వరంగల్ రూరల్ నుంచి 26 మరియు ములుగు జిల్లా నుంచి 11 కేసులు నిర్ధారించబడ్డాయి. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నుంచి 86, జగిత్యాల నుంచి 81, పెద్దపల్లి నుంచి 35 మరియు సిరిసిల్ల నుంచి 29 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 20న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 8 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 737 కు పెరిగింది.

అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 1,781మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 76,967 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,843 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 21, 2020 08:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).