Telangana: బొట్టు పెట్టి పెళ్లి అయిందని నమ్మించి యువతిని మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఏకంగా ఫ్లాట్ అద్దెకు తీసుకుని మరి అరాచకం, వివరాలివే

సింధూరం పెట్టి పెళ్లి అయిందని నమ్మించి, యువతిని మోసం చేశాడు ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తె..మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ (26) బెంగుళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఒక క్లినిక్‌లో పనిచేసే యువతి పరిచయం అయింది.

Telangana: బొట్టు పెట్టి పెళ్లి అయిందని నమ్మించి యువతిని మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఏకంగా ఫ్లాట్ అద్దెకు తీసుకుని మరి అరాచకం, వివరాలివే
Software Employee Deceives Young Woman by Pretending Marriage with Sindoor(X)

Hyd, Feb 21:  సింధూరం పెట్టి పెళ్లి అయిందని నమ్మించి, యువతిని మోసం చేశాడు ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తె..మంచిర్యాల జిల్లాకు(Telangana) చెందిన సాయి ప్రణీత్ (26) బెంగుళూరులో సాప్ట్‌వేర్(Software Employee) ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఒక క్లినిక్‌లో పనిచేసే యువతి పరిచయం అయింది. ఇద్దరు ఒకే హాస్టల్‌లో ఉండేవారు.

తన తండ్రికి గుండెపోటు వచ్చిందని సొంతూరు ఒడిశాకు వెళ్లిన యువతికి రోజు ఫోన్ చేసి సాయి ప్రణీత్ యోగక్షేమాలు అడిగేవాడు… ఇలా స్నేహం ఏర్పడి, ఆ స్నేహం ప్రేమగా మారింది.

కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్.. అసెంబ్లీకి రాకపోతే వేటు వేయాలని అభ్యర్ధన

ప్రేమలో పడ్డాక కేరళ టూర్ వెళ్లి అక్కడ హోటల్‌లో నుదుటన సింధూరం పెట్టి పెళ్లి అయిపోయిందని యువతిని నమ్మించాడు. 2023లో ఇద్దరు షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ సాయి ప్రణీత్... తన తల్లిదండ్రులను పరిచయం చేయడంతో ఆ యువతికి అతని మీద నమ్మకం మరింత పెరిగింది. 2024లో ఇద్దరు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని నివసించారు.

అయితే గత ఏడాది నవంబర్ లో చెల్లికి పెళ్లి కుదిరిందని మంచిర్యాల వెళ్లిన యువకుడు తిరిగి రాకపోవడంతో యువతికి అనుమానం వచ్చి అతన్ని నిలదీసింది. రూ.20 లక్షలు తీసుకోని మన బంధం మర్చిపోవాలని అతను చెప్పడంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు యువకుడి మీద లైంగిక దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Feb 21, 2025 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).