KCR to attend state executive committee meeting at Telangana bhavan(X)

Hyderabad, Feb 21: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పై తెలంగాణ హైకోర్టులో (Petition Filed In High Court Against KCR) ఓ పిటిషన్ దాఖలయింది. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకి రావడంలేదని,  దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని సదరు పిటిషనర్ కోరారు. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ప్రజల పక్షాన నిలబడుతూ అసెంబ్లీలో పోరాడాలని, అసెంబ్లీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయ్ పాల్ రెడ్డి కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రానందువల్ల..  గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రాతినిధ్యాన్ని రద్దు చేసి వేరే వాళ్లను పోటీ చేయించాలని అన్నారు.

బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

రిజిస్ట్రీ పరిశీలనలో పిటిషన్

2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని, ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచారని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని పిటిషన్ లో కోరారు. ప్రతివాదులుగా కేసీఆర్, కేటీఆర్ లతో పాటు స్పీకర్, స్పీకర్ కార్యాలయాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.

స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన