
Hyderabad, Feb 21: భారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Indian Shuttler Satwiksairaj Rankireddy) ఇంట విషాదం చోటుచేసుకుంది.. సాత్విక్ సాయిరాజ్ కి పితృవియోగం నెలకొంది. ఆయన తండ్రి కాశీవిశ్వనాథ్ గుండెపోటుతో (Cardiac Arrest) హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. గుండెపోటుతో ఆయన కుప్పకూలిపోగానే.. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ఆయన అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. కాశీవిశ్వనాథ్ పీఈటీగా పనిచేసి రిటైర్ అయ్యారు. భార్య రంగనాయకి ఉపాధ్యాయురాలు. పెద్ద కుమారుడు చరణ్ తేజ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి భారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ గా ఎదిగారు. కాగా పెద్దకొడుకు చరణ్ తేజ స్వదేశానికి వచ్చాక కాశీవిశ్వనాథ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.
Indian Badminton player Satwiksairaj Rankireddy's father R Kasi Viswanatham passed away after suffering a cardiac arrest on Thursday pic.twitter.com/OkFNiy3DRI
— The Khel India (@TheKhelIndia) February 20, 2025
అవార్డు కోసమని వెళ్తుండగా..
సాత్విక్ తరుఫున ఆయన మేనేజర్ శుక్రవారం ఢిల్లీలో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాశీ విశ్వనాథ్ గురువారం అమలాపురంలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. కారులో ప్రయాణిస్తూ కాసేపటికే ఆయన కుప్పకూలిపోయారు. దవాఖానకు తరలించినా ఫలితం లేకుండా పోయింది.