ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదిక‌గా భార‌త్ త‌మ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అరుదైన ఘ‌న‌త సాధించాడు.అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆట‌గాడిగా భార‌త క్రికెట్ దిగ్గ‌జం మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ రికార్డును కోహ్లి స‌మం చేశాడు. అజారుద్దీన్ 334 మ్యాచ్‌ల్లో 156 క్యాచ్‌లు అందుకోగా.. విరాట్ కేవ‌లం 298 మ్యాచ్‌ల్లో స‌రిగ్గా 156 క్యాచ్‌ల‌ను తీసుకున్నాడు. కోహ్లి మ‌రో క్యాచ్ అందుకుంటే అజారుద్దీన్‌ను అధిగ‌మిస్తాడు.

రికార్డుల ఊచకోత కోసిన మొహమ్మద్ షమీ, ఏకంగా నాలుగు రికార్డులకు పాతర, బంగ్లాతో 5 వికెట్లతో దుమ్మురేపిన భారత స్పీడ్ స్టర్

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాను తౌహిద్ హృదయ్‌, జాకర్‌ అలీ తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. తౌహిద్‌ హ్రిదయ్‌(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) రాణించాడు.

Virat Kohli Equals Mohammad Azharuddin's Record Of Most Catches for India in ODIs

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)