చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన 2013 ఛాంపియన్స్ బంగ్లాపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. గిల్‌ 128 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేయగా.. కేఎల్‌ రాహుల్‌ 47 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో రషిద్‌కు రెండు, తక్సిన్‌ అహ్మద్‌, రెహమాన్‌కు చెరో వికెట్‌ దక్కింది.

ఇక చాంపియన్స్ ట్రోఫీలోనూ బన్నీ మేనియా కనిపించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో తగ్గేదేలే సెలబ్రేషన్ వైరల్ అయింది. హాఫ్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ బ్యాట్‌తో తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్‌ను హెల్మెట్ కింద నుంచి తీసుకెళ్తూ తగ్గేదేలే పోజ్‌ను దించేశాడు జేకర్ అలీ. ఈ మ్యాచ్‌లో ఒక సమయంలో బంగ్లాదేశ్ 35 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన జేకర్ పాతుకుపోయాడు.

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు

జాకర్ అలీ 206 బంతుల్లో తోహిద్ హ్రిడోయ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 154 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 114 బంతుల్లో 4 ఫోర్లతో సహా 68 పరుగులు చేశాడు. తన అర్ధ సెంచరీని చేరుకున్న తర్వాత, జాకర్ అలీ ఐకానిక్ 'పుష్ప' వేడుకను చేశాడు. కష్టకాలంలో వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడిన జేకర్ బన్నీ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు.

Jaker Ali’s Stunning Pushpa Celebration:

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)