Telangana: తీవ్ర విషాదం, కూతురు పెళ్లిలో తండ్రికి గుండెపోటు, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తిరిగిరాని లోకాలకు, కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన

కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో కూతురు పెళ్లి.. వివాహానికి అంతా సిద్ధమవుతుండగా.. ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది.

Telangana: తీవ్ర విషాదం, కూతురు పెళ్లిలో తండ్రికి గుండెపోటు, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తిరిగిరాని లోకాలకు, కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన
Heart-Attack (File Image)

Hyd, Sep 4: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో కూతురు పెళ్లి.. వివాహానికి అంతా సిద్ధమవుతుండగా.. ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రల రాములు(48) కేశవపట్నంలో ట్రాక్టర్‌ మెకానిక్‌. అతనికి భార్య మంజుల, కూతుళ్లు లావణ్య, కోమల, వీణ ఉన్నారు.

వణికిస్తున్న హార్ట్ ఎటాక్ మరణాలు, తాజాగా గుండెపోటుతో ఇద్దరు విద్యార్థులు మృతి, జార్జియాలో ఏపీ MBBS విద్యార్థి మృతి

పెద్దకూతురు లావణ్య వివాహం జమ్మికుంట మండలం శాయంపేటకు చెందిన సతీశ్‌తో మండలంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 10.41 గంటలకు జరగాల్సి ఉంది. బంధువులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. వేకువజామున రాములుకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తండ్రి మృతితో లావణ్య వివాహం ఆగిపోయింది. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

(The above story first appeared on LatestLY on Sep 04, 2023 02:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).