Telangana Cabinet Decisions: హైడ్రాకు చట్టబద్దత,సన్నవడ్లకు 500 రూపాయల బోనస్,కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ..తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతా ఊహించినట్లే హైడ్రాకు విస్తృత అధికారాలు ,చట్టబద్దత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదని మంత్రివర్గం తేల్చిచెప్పింది.

Telangana Cabinet Decisions: హైడ్రాకు చట్టబద్దత,సన్నవడ్లకు 500 రూపాయల బోనస్,కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ..తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Telangana Cabinet Grants Extensive Powers to Hydra, here are the full details(CMO X)

Hyd, Sep 21:  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతా ఊహించినట్లే హైడ్రాకు విస్తృత అధికారాలు ,చట్టబద్దత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదని మంత్రివర్గం తేల్చిచెప్పింది.

కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అలాగే హైడ్రాకు చట్టబద్దత కల్పించామని, ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగించేందుకు అధికారాలు కల్పించాం అన్నారు. orr కు లోపల చెరువులు, నాలాలు కబ్జాల కట్టడికి హైడ్రా కు అధికారాలు ఇచ్చామని అలాగే 150 మంది అధికారులను .. 946 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను హైడ్రాకు అలాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు శ్రీనివాస్ రెడ్డి.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వర్క్స్ 4,637 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చాం అని, రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పూర్తిచేస్తాం అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ చారిత్రాత్మకం కానుంది...శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణ వాటర్ తీసుకుని అవకాశం ఉందన్నారు. సన్న వడ్లకు 500 బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీపై గతంలో కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని రెండు పంటలకు కలువ ద్వారా నిల్లోస్తాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీతో నల్గోండ జిల్లాకు పూర్తిగా ఫ్లోరైడ్ దూరం అవుతుందన్నారు.

తెలంగాణ కేబినెట్ పూర్తి నిర్ణయాలివే..

()మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరును, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును మంత్రిమండలి నిర్ణయించింది.

() తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూమి కేటాయింపు.

() ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 58 ఎకరాల భూమి కేటాయింపు.

() ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు.

() రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 3 వేల పోస్టుల మంజూరు

() ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను రెండేండ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల చిరకాల కోరికను నెరవేర్చడం.

() కోస్గి ఇంజనీరింగ్ కాలేజీకి, హకీంపేటలో జూనియర్ కాలేజీకి అవసరమైన పోస్టులు మంజూరు. సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి రిలీఫ్, ఓటుకు నోటు కేసును బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ

() హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించడం.

()తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది.

() హైడ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించుకునేందుకు అనుమతి.

() ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్.

() రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్వర్యంలో 12 మందితో కమిటీ ఏర్పాటు.

() ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమును ఎస్పీఎఫ్‌కు కూడా వర్తింపజేయడం.

()కోర్ అర్బన్ రీజియన్‌లో జీహెచ్ఎంసీతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హైడ్రా కమిషనర్‌కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం.

() కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయడం.

(The above story first appeared on LatestLY on Sep 21, 2024 10:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).