CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాజకీయాలు ఎన్నికల వరకేనని వెల్లడి, వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.
Hyd, July 4: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తో చర్చించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించాలని వినతిపత్రం ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర పెద్దలను కలిశామన్నారు. వీడియో ఇదిగో, కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్థమైంది, మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని తెలిపిన బీఆర్ఎస్ అధినేత
రాజకీయాలు ఎన్నికల వరకేనని... ఆ తర్వాత కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసి పని చేయాలన్నారు. సత్సంబంధాలు కొనసాగాలని... అందుకే కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చామన్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పని చేయాలనే ఆకాంక్షతో కేంద్రమంత్రులను కలిసినట్లు చెప్పారు. తెలంగాణ ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
Here's Pics
Telangana Chief Minister Revanth Reddy, along with Deputy CM Bhatti Vikramarka Mallu called on Prime Minister Narendra Modi, in Delhi today. pic.twitter.com/0SKcsRC7X4
— ANI (@ANI) July 4, 2024
గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి కోల్ బ్లాక్స్ వేలం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రధాని మోడీని కోరాం. తెలంగాణకు ఐఐఎం, ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాకు నవోదయ, కస్తూర్బా విద్యాలయాలు ఇవ్వాలని విన్నవించాం. రక్షణ శాఖ భూముల విషయంలోనూ చర్చలు జరిపాం. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని వెల్లడి
ఏపీ విభజన చట్టం షెడ్యూల్ 9, 10లో అపరిష్కృత అంశాలకు వెంటనే పరిష్కారం చూపాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రాజదారులుగా అభివృద్ధి చేయాలని కోరాం. రీజనల్ రింగ్ రోడ్డుకు ఒకే నంబర్ ఇవ్వాలని ప్రధానికి చెప్పాం. భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశాం. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సాధించడం కోసం మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అన్ని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది" అని తెలిపారు.
బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఇంకా ప్రేమ తగ్గినట్లుగా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరమన్నారు. 11 రాష్ట్రాల్లో బీజేపీ ఎంతోమందిని చేర్చుకొని అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పాలన్నారు. అసలు కేసీఆర్ పట్ల బీజేపీ నేతలు, ఈటలకు సానుభూతి ఎందుకో చెప్పాలన్నారు. ఈటల ఇప్పటికీ కేసీఆర్‌నే తన నాయకుడిగా అనుకుంటున్నట్లుగా ఉన్నాడని చురక అంటించారు. అయినా ప్రజలకు మేలు చేయడానికి తాము ఏం చేయాలో అదే చేస్తామన్నారు.
మంత్రి వర్గ విస్తరణపై తాను ఎప్పుడూ తేదీని ప్రకటించలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు. తన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఈ నెల 7న ముగియనున్నాయని, అందుకే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఏఐసీసీ పెద్దలను కోరినట్లు చెప్పారు. ఇప్పుడు ఈ అంశం ఏఐసీసీ కోర్టులో ఉందన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేదని ముఖ్యమంత్రి అన్నారు. టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పుట్టిన 25 ఏళ్లలో ఇంతటి దీనావస్థలో ఎప్పుడూ లేదన్నారు. ఇక బీఆర్ఎస్ గత చరిత్రే... భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. తమ పరిపాలనపై విమర్శలు చేసే ముందు బీజేపీ నాయకులు యూపీ, మహారాష్ట్రను పరిగణనలోకి తీసుకొని మాట్లాడాలని హితవు పలికారు.
(The above story first appeared on LatestLY on Jul 04, 2024 10:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

