CM Revanth Reddy: ఒక్క రోజులో అద్భుతాలు సృష్టించలేం, ఉద్యోగాల కల్పనపై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్

ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

CM Revanth Reddy: ఒక్క రోజులో అద్భుతాలు సృష్టించలేం, ఉద్యోగాల కల్పనపై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్
Telangana CM Revanth Reddy challenges Union ministers on job creation record(CMO X)

Hyd, Dec 5: ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రులకు సీఎం సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు.

గడిచిన పదేండ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారిగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు.

ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు. నిరుపేదల బిడ్డల చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని గుర్తుచేశారు.కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు.పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు.  తెలంగాణలో గూగుల్ భారీ పెట్టుబడులు, హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు..సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ కంపెనీ ప్రతినిధుల చర్చలు సఫలం 

కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశాం. తొలి సంవత్సరంలో 21 వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర సృష్టించాం అన్నారు. నిర్భందాల మధ్య సాగిన పదేండ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు.

(The above story first appeared on LatestLY on Dec 05, 2024 08:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).